Sunday, September 8, 2024
Homeజాతీయంభయపెడుతున్న మరో వైరస్

భయపెడుతున్న మరో వైరస్

ఇటీవల వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు దేశ ప్రజలను మరింతగా భయ పెడుతుంటే తాజాగా ఇప్పుడు ఎల్లో వైరస్ బైటపడింది. ఇది ఆ రెండు ఫంగస్ ల కంటే ప్రమాదకరమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తొలుత ఢిల్లీ లో ఎల్లో ఫంగస్ కేసు నమోదు కాగా రెండవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో గుర్తించారు. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులను ఆదేశించింది.

ఆకలి తగ్గడం లేదా ఆకలి పూర్తిగా లేకపోడం దీని ప్రధాన లక్షణం కాగా, కళ్ళు మూసుకుపోవడం, శరీర భాగాలలో ఏర్పడిన గాయాల నుంచి విపరీతంగా చీము కారుతుందని చెబుతున్నారు. ఈ లక్షణాలు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయనేది స్పష్టంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్, కాన్సర్ లతో బాధపడేవారు పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి వుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్