Monday, February 24, 2025
Homeసినిమాతెలుగు తెరకి మరో మలయాళ బ్యూటీ!       

తెలుగు తెరకి మరో మలయాళ బ్యూటీ!       

Another Kutti: తెలుగు తెరపై ఒకప్పుడు బాలీవుడ్ భామలదే హవా. ఆ తరువాత కాలంలో  ముంబైలో   మోడలింగ్ చేస్తూ టాలీవుడ్ వైపు వచ్చినవారు ఎక్కువ. ఈ సమయంలోనే కేరళ వైపు నుంచి కూడా టాలీవుడ్ దిశగా అందగత్తెల వలస మొదలైంది. ఇటు గ్లామర్ పరంగాను .. అటు నటన పరంగాను మలయాళ మందారాలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన బ్యూటీలంతా ఇక్కడి యూత్ ను తమ వైపుకు తిప్పుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అంతేకాదు తెలుగుతో పాటు తమిళంలోను వాళ్లు తమ జోరును కొనసాగించారు.

తెలుగు తెరపై సందడి చేసిన ముద్దుగుమ్మల జాబితాను బయటికి తీస్తే వాళ్లలో మలయాళ భామలే ఎక్కువగా ఉంటారు. అలా కేరళ నుంచి ఇప్పుడు మరో మలయాళ సోయగం తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సుందరి పేరే ‘ఆత్మీయరాజన్‘. మలయాళ  సినిమాతో ఆమె తన కెరియర్ ను మొదలు పుష్కర కాలం కావొస్తోంది. మలయాళంలోని సీనియర్ స్టార్ హీరోల సరసన ఆకట్టుకుంది. ఇక తమిళంలోను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలా మలయాళ .. తమిళ  సినిమాల తరువాతనే ఆమె టాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

తెలుగులో ఆమె ‘శేఖర్ ‘ సినిమా ద్వారా తెరకి పరిచయమవుతోంది. రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో ‘శేఖర్’ రూపొందింది. జీవిత ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండగా, ఒక నాయికగా ఆత్మీయ రాజన్ కనిపించనుంది. ఇటీవలే ఆమె కాంబినేషన్లోని రాజశేఖర్ సాంగ్ ను కూడా ఈ సినిమా నుంచి వదిలారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని            ఆత్మీయ రాజన్ భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

Also Read : హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది: జీవిత  

RELATED ARTICLES

Most Popular

న్యూస్