Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL: రైజింగ్ లేని సన్ రైజర్స్

IPL: రైజింగ్ లేని సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి బోల్తా పడింది. బ్యాటింగ్ లో విఫలమై దారుణ ఓటమిని చవి చూసింది.  చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ఘనవిజయం సాధించింది.  చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్  గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.

హైదరాబాద్ తొలి వికెట్ కు (హ్యారీ బ్ర్రూక్-18) 35 పరుగులు చేసింది, 71 పరుగుల వద్ద మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (34) ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి-21; కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్-12; హెన్రిచ్ క్లాసేన్-17; మార్కో జాన్సెన్-17 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3; ఆకాష్ సింగ్, మహీశ తీక్షణ, మతీశ పతిరణ తలా ఒక వికెట్ తీశారు.

చెన్నై తొలి వికెట్ కు 87 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 30 బంతుల్లో 2 ఫోర్లతో 37 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. అజింక్యా రేహానే, అంబటి రాయుడు చెరో 9 పరుగులు చేసి మయాంక్ మార్కండే బౌలింగ్ లో ఔటయ్యారు. మరో ఓపెనర్ డెవాన్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 77; మోయిన్ అలీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం చెనై విజయం సొంతం చేసుకుంది.

హైదరాబాద్ బౌలర్లలో మయాంక మార్కండేకు రెండు వికెట్లు దక్కాయి.

రవీంద్ర జడేజా కు  కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్