Saturday, January 18, 2025
Homeసినిమాపట్టాలపైకి 'దసరా' కాంబినేషన్!

పట్టాలపైకి ‘దసరా’ కాంబినేషన్!

ఒకసారి హిట్ కొట్టిన హీరో – దర్శకుడు కలిసి మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదే. అదే విషయం ఇప్పుడు నాని విషయంలోను రిపీట్ అవుతోంది. నాని కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ‘దసరా’ ఒకటి. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మాస్ మూవీ ఇది. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కీర్తి సురేశ్ కథానాయికగా ఈ సినిమాలో సందడి చేసింది.

ఈ సినిమాతోనే దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు. అతనితో నాని మరో సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అది నిజమేనంటూ నిన్న ఈ కాంబినేషన్ నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లోని ఈ సినిమాకి, ‘దసరా’ నిర్మాతనే నిర్మిస్తున్నాడు. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారనేది తెలియవలసి ఉంది. నాని డిఫరెంట్ లుక్ తో కనించనున్నాడనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఈ మధ్య కాలంలో నాని పాత్రకి తగినట్టుగా .. కొత్తగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలాగే ఈ సినిమాలోను శ్రీకాంత్ ఓదెల ఆయనను విభిన్నంగా చూపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుంది? అనేది త్వరలో తెలియనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్