Thursday, May 8, 2025
HomeTrending NewsTamilanadu: స్టాలిన్ ప్రభుత్వంతో గవర్నర్ కొత్త పేచీ

Tamilanadu: స్టాలిన్ ప్రభుత్వంతో గవర్నర్ కొత్త పేచీ

తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య మరో కొత్త పేచీ మొదలైంది. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) చైర్మన్‌ నియామకంపై స్టాలిన్‌ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను గవర్నర్‌ వెనక్కిపంపారు. అంతేగాక తమిళనాడు కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసిన ‘మోడల్‌ సిలబస్‌’ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

‘మోడల్‌ సిలబస్‌’ను ఫాలో కావాల్సిన అవసరం లేదని తెలుపుతూ వర్సిటీ వీసీలకు గవర్నర్‌ లేఖలు పంపారు. యూజీసీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సిలబస్‌ ఎలా తయారుచేస్తుందని ప్రశ్నించారు. మాజీ డీజీపీ సీ సైలేంద్రబాబును టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్‌గా నియమిస్తూ, కమిషన్‌ సభ్యులుగా మరో 14 పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌ ఆమోదానికి సంబంధిత ఫైల్‌ను ప్రభుత్వం పంపింది. అయితే కమిషన్‌ చైర్మన్‌, సభ్యులకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటూ ఫైల్‌ను వెనక్కి పంపారని గవర్నర్‌ అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్‌ తీరును డీఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తుల్ని కమిషన్‌కు ఎంపికచేసినా..ఫైల్‌ను ఎందుకు ఆమోదించలేదని డీఎంకే నాయకుడు ఆర్‌ఎస్‌ భారతీ ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్