Tuesday, June 9, 2026
Homeసినిమానాట్యం` సినిమాలో `వేణువులో..` పాట‌ను రిలీజ్ చేసిన ర‌వితేజ

నాట్యం` సినిమాలో `వేణువులో..` పాట‌ను రిలీజ్ చేసిన ర‌వితేజ

నృత్యరీతులను ప్రధాన అంశంగా తీసుకొని ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌ కి  ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుండి `వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు…` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు  శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular