Tuesday, June 9, 2026
Homeసినిమాతెలుగు తెరకి మరో ముగ్గురు ముద్దుగుమ్మలు!

తెలుగు తెరకి మరో ముగ్గురు ముద్దుగుమ్మలు!

3 new comers: తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అందంతో పాటు కాస్తంత అభినయం ఉంటే చాలు ఇక్కడి ప్రేక్షకులు అమాంతంగా ఆదరించేస్తారు .. నీరాజనాలు పట్టేస్తారు. అందానికీ .. అభినయానికి సక్సెస్ తోడైతే ఇక్కడ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. పారితోషికాన్ని పరిగెత్తించడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. అందువలన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇతర భాషలకి చెందిన భామలు ముచ్చటపడుతుంటారు .. ఉత్సాహంతో ఉప్పెనలా అడుగుపెడుతుంటారు.

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన కృతి శెట్టి .. శ్రీలీల .. కేతిక శర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో ముగ్గురు కథానాయికలు పరిచయమవుతున్నారు. ఈ జాబితాలో ముందుగా  మనకి నజ్రియా నజీమ్ కనిపిస్తుంది. తన గ్లామర్ తో మలయాళ .. తమిళ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన నజ్రియా, నాని సరసన ‘అంటే .. సుందరానికీ’ సినిమాతో పరిచయమవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ  వేసవిలో విడుదల కానుంది. తెలుగు కుర్రాళ్ల నిరీక్షణ త్వరలో ఫలించబోతోంది.

ఇక ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ జోడీగా ‘సాక్షి వైద్య‘ పరిచయమవుతోంది. ఈ ముంబై బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. చూపులతోనే కట్టిపడేసే ఈ సుందరి, ఈ ఏడాదిలోనే కుర్రాళ్లకి  కునుకు లేకుండా చేయనుంది. ఇక ఆకాశ్ పూరి జోడీగా ‘చోర్ బజార్’ సినిమాతో గెహెనా సిప్పీ పరిచయమవుతోంది. ఈ బ్యూటీ కూడా ముంబై నుంచే వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ లో మెరుస్తూ మతులు పోగొట్టేసింది. మరి ఈ ముగ్గురు భామల్లో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular