Sunday, September 29, 2024
Homeసినిమా'అంటే .. సుందరానికి' అదిరిపోతుంది: నాని ప్రామిస్

‘అంటే .. సుందరానికి’ అదిరిపోతుంది: నాని ప్రామిస్

Ante… Teaser: ”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్ ఫీలింగ్ కలిగింది. ఇది మీకు తెరపై కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి

కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో వుండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు. నజ్రియా తెలుగులో నటిస్తే బావుటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి ఫోన్లు ఎత్తలేదు. మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు, మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్. టీజర్ అదిరిపోయింది. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నాని.

Also Read : ‘అంటే సుందరానికి’ నుంచి ‘పంచెకట్టు’ పాట విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్