Friday, April 19, 2024
Homeసినిమా ప్ర‌తి ఒక్క‌రూ నాతో ల‌వ్‌లో ప‌డుతారు - విశ్వ‌క్ సేన్‌

 ప్ర‌తి ఒక్క‌రూ నాతో ల‌వ్‌లో ప‌డుతారు – విశ్వ‌క్ సేన్‌

Confidence: ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్‌. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. మే 6న సినిమా భారీ లెవల్లో విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ ను చిత్ర యూనిట్‌ను విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ… నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సినిమా చేయాలనుకున్నాం. ముందుగా షార్ట్ ఫిలింస్ చేయాలనుకున్నాం. ఆ సమయంలో డైరెక్టర్ విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇద్ద‌రం క‌లిసి రెండు, మూడు షార్ట్ ఫిలింస్ చేశాం కానీ వాటిని అప్ లోడ్ చేయ‌లేదు. ఎనిమిది, తొమ్మిదేళ్ల ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కులు మాకు అండ‌గా నిల‌వ‌డం వ‌ల్ల‌నే ఇక్క‌డ వ‌ర‌కు రాగ‌లిగాం.

కోవిడ్ స‌మ‌యంలో అంద‌రం వేరే డిప్రెష‌న్‌లో ఉన్నాం. ఆ స‌మ‌యంలో నాకు ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ క‌థ నెరేట్ చేద్దామ‌ని విద్యా సాగ‌ర్‌, ర‌వి కిర‌ణ్ ప్ర‌య‌త్నించారు. నేను రెండు, మూడుసార్లు త‌ప్పించుకున్నాను. కానీ ఓ రోజు విన్నాను. తొలి ప‌ది నిమిషాల్లోనే సినిమా చేయాల‌ని డిసైడ్ అయిపోయాను. అదృష్ట‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే.. రీసెంట్‌గానే సినిమాను చూశాను. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. కానీ.. ఇప్పుడు చెబుతున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. బాపినీడు, సుధీర్‌, ర‌వి కిర‌ణ్‌, విద్యాసాగ‌ర్‌ల‌కు థాంక్స్‌. ప‌వ‌న్ బ్యూటీఫుల్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. జై క్రిష్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. దాని కంటే ప‌ది ఇర‌వై రెట్లు సినిమా బావుంటుంది. ఈ సినిమాతో ఇంట్లోని అంద‌రూ నాతో ల‌వ్‌లో ప‌డిపోతారు. మే 6న ఫ్యామిలీతో క‌లిసి సినిమా చూడండి మంచి ట్రీట్ అవుతుంది’’ అన్నారు.

Also Read : మే 6న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’

RELATED ARTICLES

Most Popular

న్యూస్