Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్ఐపీఎల్: పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్: పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించి పంజాబ్ ను 115 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత వార్నర్, పృథ్వీ షా ధాటిగా రాణించడంతో మరో 57 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యం సాధించింది.

ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ (శిఖర్ ధావన్-9) కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు సమర్పించుకుంది. జట్టులో వికెట్ కీపర్ జితేష్ శర్మ ఒక్కడే 32 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్-24; షారుఖ్ ఖాన్, రాహుల్ చాహర్ చెరో 12 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు పంజాబ్ ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యమే అయినా మొదటి ఓవర్ నుంచే ఢిల్లీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్ ఫోర్లతో పంజాబ్ బౌలర్లపై పంజా విసిరారు. తొలి వికెట్ కు 6.3  ఓవర్లలోనే 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పృథ్వీ షా 20 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 41 పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్ బౌండరీ లైన్ వద్ద నాథన్ ఎల్లిస్  పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 60, సర్ఫరాజ్ ఖాన్-12 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో 10.3 ఓవర్లలోనే ఢిల్లీ విజయం సాధించింది.

కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : లక్నోపై బెంగుళూరు విజయం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular