Sunday, March 8, 2026
Homeసినిమాఅనుపమ పరమేశ్వరన్ మరో ఛాన్స్ కొట్టేసిందే!

అనుపమ పరమేశ్వరన్ మరో ఛాన్స్ కొట్టేసిందే!

అనుపమ పరమేశ్వరన్ నిన్న మొన్నటి వరకూ కాస్త కుదురైన పాత్రలను చేస్తూ వచ్చింది. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కాస్త పద్దతిగల పాత్రలలోనే కనిపిస్తూ వచ్చింది. నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ, నిత్యా మీనన్ .. సాయిపల్లవి వంటి వారి జాబితాలో చేరిపోయింది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్స్ .. వారు ఇచ్చే గ్లామర్ డోస్ కారణంగా అనుపమకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో ఆమె తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకునే పనిలో పడింది.

అందులో భాగంగానే ఈ మధ్య అనుపమ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల ఆమె చేసిన ‘టిల్లు స్క్వైర్’ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అనుపమ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. అనుపమ ఇలా కూడా చేయగలదనే సంకేతాలు ఇటు ఇండస్ట్రీలోకి .. అటు అభిమానులలోకి వెళ్లిపోయాయి. ఈ సినిమా తరువాత ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నట్టుగా వినికిడి. ఈ నేపథ్యంలోనే అనుపమ ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. కౌశిక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘రాక్షసుడు’ విజయాన్ని సాధించింది. అందువల్లనే బెల్లంకొండ జోడీగా ఆమె ఎంపిక జరిగినట్టుగా చెబుతున్నారు. ఫాంటసీ టచ్ తో సాగే హారర్ సినిమా ఇది. త్వరలోనే ఈ విషయంపై  అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular