Saturday, June 13, 2026
Homeసినిమాఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ!

ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ!

తమిళంలో ఒక వైపున సంగీత దర్శకుడిగా .. మరో వైపున హీరోగా జీవీ ప్రకాశ్ కుమార్ బిజీ. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ లతో కూడిన లవ్ స్టోరీస్ ను ఎంచుకుంటూ యూత్ లో క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. అలాంటి జీవీ ప్రకాశ్ కుమార్ నుంచి, ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ‘డియర్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేశారు. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన, థియేటర్లకు ఈ సినిమా వచ్చివెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియదు.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో జీవీ జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. తెలుగులో ఐశ్వర్య  రాజేశ్ కి ఇమేజ్ ఉంది. ఈ మధ్య కాలంలోనే తెలుగు సినిమాల ద్వారా .. ఓటీటీ అనువాదాలు ద్వారా ఆమె తెలుగు ఆడియన్స్ కి చేరువైంది. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రలలో కాళీ వెంకట్ .. రోహిణి .. ఇళవరసు కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.

కథ విషయానికి వస్తే .. ఈ సినిమాలో హీరో ఎంత నిద్రలో ఉన్నప్పటికీ, చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి  నిద్రలేచే ఒక సమస్యతో ఇబందిపడుతూ ఉంటాడు. ఇక హీరోయిన్ గురక సమస్యతో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా తమ సమస్యను దయచేసి పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా ఏం జరిగిందనేది కథ. ఇంతకుముందు ఇలాంటి ఓ కథతో తమిళంలో వచ్చిన ‘గుడ్ నైట్’ అనే సినిమా, ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular