Sunday, June 7, 2026
Homeసినిమాఅనుప‌మ ‘బటర్‌ఫ్లై’ టీజర్‌ విడుద‌ల

అనుప‌మ ‘బటర్‌ఫ్లై’ టీజర్‌ విడుద‌ల

Anupama fly: ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. తర్వాత ‘శ‌త‌మానం భ‌వ‌తి’, ‘హ‌లో గురూ ప్రేమ కోస‌మే’ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న ఆమె  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’.  జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్ పై గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే… చాలా సంతోషంగా అపార్ట్ మెంట్‌లో అడుగుపెడుతుంది అనుపమ . లిఫ్ట్ లో అడుగుపెట్టి తొమ్మిదో ఫ్లోర్‌ కి చేరుకోవాల్సిన ఆమె రెండు, నాలుగు, ఎనిమిదిలో ఎందుకు ఆగింది? అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యాలేంటి? స్టెప్స్ లో వెళ్లినప్పుడు తెలిసిన విషయాలేంటి? సరదాగా ఉండాల్సిన ఆ వయసులో ఆమెకు అర్థమైన అంశాలేంటి? అనుక్షణం తరిమే ఇంటెన్స్ ఉన్న మ్యూజిక్‌తో ఇంట్రస్టింగ్‌గా ఉంది బటర్‌ఫ్లై టీజర్‌. అనుపమ ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తున్నారు. కెమెరా ఫ్రేమ్‌ వర్క్ అద్భుతంగా ఉంది. ఇలాంటి  సబ్జెక్ట్ కి బటర్ ఫ్లై అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్.

ఇటు యువ‌త‌, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

Also Read : అనుప‌మ ‘బటర్ ఫ్లై’ టైటిల్‌, ఫస్ట్ లుక్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular