Chiru:Anushka: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల అని అధికారికంగా ప్రకటించారు కానీ… వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సివుంది.
ఇదిలా ఉంటే.. చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు చిరంజీవి.. ఛలో, భీష్మ చిత్రాలను తెరకెక్కించి వరుసగా విజయాలు సాధించిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
ఈ మూవీలో చిరంజీవి సరసన అందాల అనుష్క నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ లో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పుడు చిరు సరసన కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా…? కాదా..? అనేది తెలియాల్సివుంది.