Saturday, January 18, 2025
Homeసినిమాజాతి రత్నంతో స్వీటి?

జాతి రత్నంతో స్వీటి?

సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకున్న బెంగుళూరు బ్యూటీ అనుష్క అలియాస్ స్వీటి. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, లక్ష్యం, డాన్.. ఇలా కమర్షియల్ మూవీస్ లో నటించి మెప్పించింది. అయితే.. అనుష్క కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చేది అరుంధతి. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ తీయాలంటే దర్శక నిర్మాతలకు అనుష్క మొదటి చాయిస్ అయ్యింది. బాహుబలి, రుద్రమదేవి, భాగమతి.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకుంది.

అయితే.. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అనుష్క గత సంవత్సరం నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుష్క తదుపరి చిత్రం ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి సరసన నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదొక వెరైటీ స్టోరీ అని.. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి మిస్ శెట్టి ..మిస్టర్  పొలిశెట్టి అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ మూవీకి రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్‌ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్