Thursday, June 11, 2026
Homeసినిమా‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ఎప్పుడు?

‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ఎప్పుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో.. అలా చూపించడంతో గబ్బర్ సింగ్ మూవీ అభిమానులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. అందుకనే మళ్లీ పవన్ – హరీష్ కాంబినేషన్ లో మూవీ రావాలని అభిమానులు గట్టిగా కోరుకున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగానే ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే.. పవర్ స్టార్ కి కరోనా రావడం.. ఆతర్వాత కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరగడంతో షూటింగ్ లకు బ్రేక్ పడింది. కరోనా నుంచి కోలుకుని  ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవర్ స్టార్ ఆగష్టు నుంచి షూటింగ్ చేయడానికి డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్ – రానా ల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో కూడా పవన్ పాల్గొనాల్సివుంది. అందుచేత హరీష్ శంకర్ తో చేయనున్న సినిమా వచ్చే సంవత్సరంలో సెట్స్ పైకి రానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular