పాకిస్థాన్ ఎన్నికల్లో గెలిచేందుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్- పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ల కూటమి వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేసింది. తిరుగుబాటు, వేర్పాటువాదం తో తీవ్ర అసంత్రుప్తిలో ఉన్న బలూచ్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆ రాష్ట్ర నేతను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ నియమితులయ్యారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ సెనెటర్‌గా ఉన్న ఆయన ఎన్నికలు జరిగేంత వరకు కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కాకర్‌ను నియమించాలని కోరుతూ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీప్, ప్రతిపక్ష నేత సంతకం చేసిన తీర్మానాన్ని అధ్యక్షుడికి పంపించినట్టు పీఎంవో కార్యాలయం తెలిపింది. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.