7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సేంద్రీయ వ్యవసాయ పాలసీ : కన్నబాబు

సేంద్రీయ వ్యవసాయ పాలసీ : కన్నబాబు

రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ది, ప్రజారోగ్యం ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  వ్యవసాయ, ఉద్యానవన , ఫుడ్ ప్రోసెసింగ్ , విత్తనాభివృద్ది, జాతీయ సేంద్రియ విధానం సంస్థల ఉన్నతాధికారులతో  ఆర్గానిక్ పాలసీ ఆవశ్యకతపై మంత్రి కన్నబాబు సుదీర్ఘంగా చర్చించారు.  రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు.

రసాయనాలు , పురుగు మందుల వినియోగం తగ్గించేలా గ్రామీణ రైతాంగంలో అవగాహనా పెంచాలన్నారు. డిమాండ్ మేరకే ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలని సూచించారు. బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్ , ఇతర రసాయనాల వినియోగంపై కమిటీ సభ్యులతో  మంత్రి చర్చించారు.

కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే  రైతులను సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలని కమిటీ సభ్యులు సూచించారు. సంబంధిత శాఖల సూచనలు అభిప్రాయాలను సేకరించి సీఎంతో చర్చించి త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు.

ఈ సమీక్షలో  వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , రైతు సాధికార సంస్థ ముఖ్య అధికారి విజయ్ కుమార్ , మార్కెటింగ్ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్