ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తీసుకుంది.
గత నవంబర్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రాజ్యంగ నిబంధన ప్రకారం 6 నెలలకు కనీసం ఒక్కసారైనా సభ సమావేశం కావాల్సి వుంటుంది. జూన్ 3 నాటికి ఆరు నెలల గడువు ముగియనుంది. దీంతో ఈ నెల 20న సభను సమావేశ పరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో ఒక్కరోజు మాత్రమే సభను నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి.
ఈరోజు సాయంత్రం అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.