AP Assembly Sessions :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 26 వరకూ జరగనున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటి (బిఏసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన సభా వ్యవహారాలు, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిడిపి తరఫున శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. శాసన మండలి బిఏసి మరికాసేపట్లో జరగనుంది.
నేటితో కలిపి మొత్తం ఏడు పనిదినాలు సభ జరగనుంది. నేడు, రేపు సభ జరుగుతుంది. శని, ఆదివారాలు (నవంబర్20, 21) సెలవులు, వచ్చేసోమవారం నుంచి శుక్రవారం వరకూ ఐదురోజుల పాటు ఉభయ సభలు జరుగుతాయి.
Also Read : చంద్రబాబు కోటలో వైసీపీ పాగా