Monday, May 20, 2024
HomeTrending Newsచంద్రబాబు కోటలో వైసీపీ పాగా

చంద్రబాబు కోటలో వైసీపీ పాగా

 Kuppam Municipality :

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని కుప్పం నగర పంచాయతీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 25 వార్డులున్న ఈ స్థానంలో ఒకటి వైసీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. నేడు కౌంటింగ్ జరుగుతోన్న 24 వార్డుల్లో ఇప్పటికి 15 వార్డుల ఫలితాలు వెల్లడికాగా వైసీపీ 13 గెల్చుకోగా, కేవలం రెంటిలో మాత్రమే టిడిపి విజయం సాధించింది.

నెల్లూరు కా ర్పొరేషన్తోపాటు మరో 12మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ తొమ్మిది మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టిడిపి పాగా వేసింది.  కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

మొత్తం 9 స్థానాలకు అధికారికంగా ఫలితాలు ప్రకటించారు. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి:

  1. ఆకివీడు (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-12; తెలుగుదేశం-4; జనసేన-3, ఇండిపెండెంట్-1
  2. దర్శి (మొత్తం వార్డులు:20) తెలుగుదేశం-13; వైఎస్సార్సీపీ- 7
  3. దాచేపల్లి (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-11; తెలుగుదేశం-7; జనసేన-1; ఇండిపెండెంట్-1
  4. గురజాల (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-16; తెలుగుదేశం-3; జనసేన-1
  5. బేతంచెర్ల (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-14; తెలుగుదేశం-6
  6. బుచ్చిరెడ్డిపాలెం (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-18; తెలుగుదేశం-2
  7. పెనుకొండ (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-18; తెలుగుదేశం-2
  8. రాజంపేట (మొత్తం వార్డులు:29) వైఎస్సార్సీపీ-24; తెలుగుదేశం-4; ఇండిపెండెంట్ –1
  9. కమలాపురం (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-15; తెలుగుదేశం-5

నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ ఇప్పటికే 22 స్థానాలు గెల్చుకొని దూసుకుపోతోంది. టిడిపి ఇంకా ఖాతా తెరవలేదు.

Also Read : మున్సి’పోల్స్’లో వైసీపీ హవా: టిడిపికి దర్శి

RELATED ARTICLES

Most Popular

న్యూస్