మహిళలు ఆత్మన్యూనత భావాన్ని తరిమి కొట్టాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపు నిచ్చారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా దిశా యాప్ పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దిశా యాప్ విప్లవాత్మకమైనదన్నారు. మహిళల్లో ఆత్మన్యూనత భావం ఉందని, దానిని తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

పురుషాహంకార సమాజంలో మహిళల మానసిక స్థితి మారాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి గొప్ప మానవతా వాది అన్నారు. మన సంస్కృతిలో మహిళలకు పెద్ద పీట వేయడం జరిగిందని ఆయన చెప్పారు. పురుషాహంకారనికి దిశా యాప్ శాపంగా మారిందని ఆయన అన్నారు. పురుషుల ఆలోచనా ధోరణి మారాలని స్పీకర్ హితవు పలికారు. దిశా యాప్ మహిళల భద్రతకు అత్యంత ప్రయోజనకరమన్నారు. యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ పెట్టాలని ఆయన సూచించారు.

రాష్ట్ర పశుసంర్ధక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు రెడ్డి శాంతిశ్రీ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దిశా యాప్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వీడియోలను ప్రదర్శించారు. పోలీసు సిబ్బది దిశా యాప్ ను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *