Saturday, November 23, 2024
HomeTrending NewsAP BJP: తెనాలిలో మట్టి సేకరించిన పురందేశ్వరి

AP BJP: తెనాలిలో మట్టి సేకరించిన పురందేశ్వరి

భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘నా భూమి- నాదేశం’ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెనాలి సమీపంలోని కొలకలూరులో  మట్టిని సేకరించారు. ‘మేరి మట్టి- మేరా దేశ్’ నినాదంతో దేశవ్యాప్తంగా ఈ మట్టిని సేకరించి దీనితో దేశ రాజధాని  ఢిల్లీలో అమృతవనం ఏర్పాటు చేయనున్నారు.  పురందేశ్వరి తోపాటు పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 15 వరకూ ఏపీలో ‘నా భూమి- నా దేశం’ కార్యక్రమాన్ని నిర్వహించానున్నారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తారు. పట్టణాల్లో మట్టి ఉండదు కాబట్టి చిటికెడు బియ్యం  సేకరించాలని ఏపీ బిజెపి నిర్ణయించింది. అక్టోబర్ 3-11 వరకూ రెండో దశ నిర్వహిస్తామని… చివరి దశలో దేశవ్యాప్తంగా సేకరించిన ఈ మట్టిని ఢిల్లీకి చేర్చి అక్కడ  నిర్మించబోయే అమృత వనానికి  వినియోగిస్తారు. దీదేశమంతా ఒకటే అనే భావన  కలిగించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని బిజెపి నేతలు పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్