Dr. YSR: మీ ఆశయాలే నడిపిస్తున్నాయి: తండ్రికి జగన్ నివాళి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ లో ఆయన సమాధి వద్ద పూలమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి. డిప్యూటీ సిఎం అంజాద్ పాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతరే నేతలు పాల్గొన్నారు. ప్రత్యెక ప్రార్థన నిర్వహించారు.

తన తండ్రి వైఎస్ ఆశయాలే చేయిపట్టి నడిపిస్తున్నాయని సిఎం జగన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలో ఈ మేరకు సందేశం ఇస్తూ నివాళులు అర్పించారు.

“నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా” అంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *