Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అల్లూరి ఉత్సవాలకు రండి

అల్లూరి ఉత్సవాలకు రండి

స్వాతంత్ర్య సమరయోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా ఏపి బిజెపి అధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలకు హాజరు కావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి. కిషన్ రెడ్డిని రాష్ట్ర బిజెపి నేతలు ఆహ్వానించారు,

ఢిల్లీలో కిషన్ రెడ్డితో ఏపి బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నేతలు మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. జయంతి ఉత్సవాలకు కేంద్ర టూరిజం శాఖ నుండి నిధులు కేటాయించాలని కోరారు. బీజేపి నేతల విజ్ఞప్తిని అంగీకరించిన కిషన్ రెడ్డి నిధుల విడుదలకు హామీ ఇచ్చారు.

కేంద్ర పెద్దలతో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని మరో వినతి పత్రాన్ని కూడా కేంద్రమంత్రికి బీజేపి నేతలు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్