Thursday, March 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వం సలహాలు తీసుకోవాలి : వీర్రాజు

ప్రభుత్వం సలహాలు తీసుకోవాలి : వీర్రాజు

కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. ప్రభుత్వం అందరితో చర్చించాలని, నీటిపారుదల నిపుణుల సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరీ జలాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హక్కులను కాపాడడంలో బిజెపి ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం బిజెపి కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అయన మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల శాఖ ఎక్కువగా తెలంగాణా నేతల వద్దే ఉండేదని, దానివల్ల కూడా ఏపికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు. నీటి విషయంలో ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని నదుల అనుసంధానంపై ఏపి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు. నదీ జలాలపై తెలంగాణా అధ్యయనం చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ లో చేయడం లేదని అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రభుత్వం నీటిపారుదల నిపుణుల సలహాలు తీసుకుంటున్నారని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. వారిలో ఉన్న పోరాట పటిమ మనలో లేదన్నారు.

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏమొస్తుందని వీరాజు ప్రశ్నించారు, హోదా ఆందోళన కేవలం రాజకీయ ప్రేరేపితమేనని, పొలిటికల్ డ్రామా అని వీర్రాజు వ్యాఖానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్