రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్ శాతాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారికంగా వెల్లడించారు. మొత్తం 80.66 శాతం పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం మేర నమోదైనట్లు తెలియజేశారు. దీనితో మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది.
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదు కాగా, తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ జరిగింది.
ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% పోలింగ్ నమోదైంది,
2019 ఎన్నికల్లో 79.6 % నమోదు కాగా ఈసారి దానికంటే 2.2 శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.