Friday, June 12, 2026
Homeసినిమావిజయ్ దేవరకొండ జోడీగా సాయిపల్లవి!

విజయ్ దేవరకొండ జోడీగా సాయిపల్లవి!

సాయిపల్లవి .. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవలసిన అవసరం లేదు. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఫ్యామిలీ ఆడియన్స్ వైపు నుంచి బలమైన మద్దతు ఉంది. సాయి పల్లవి సినిమా అంటే ఎలాంటి సందేహం లేకుండా ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాకి వెళ్లొచ్చు అనే ఒక నమ్మకాన్ని ఆమె ఇచ్చేసింది. అందువల్లనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథల విషయంలో ముందుగా ఆమె పేరునే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి సాయిపల్లవి ‘విరాట పర్వం’ తరువాత ఇక్కడి తెరపై కనిపించలేదు.

ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘తండేల్’తో పాటు .. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులనే చెప్పాలి. ‘తండేల్’లో ఆమె చైతూ సరసన కనిపించనుంది. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండతో చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సాయిపల్లవిని కథానాయికగా తీసుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయని సమాచారం.

ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. కథానాయిక పాత్రకి నటన పరమైన ప్రాధాన్యత ఉండటంతో, సాయిపల్లవి అయితేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని అతను భావించాడట. అందువలన ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. గతంలో దిల్ రాజు నిర్మించిన ‘ఫిదా’ .. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలు సాయిపల్లవి కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. అందువలన దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చేయడానికి సాయిపల్లవి ఆసక్తి చూపించవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular