Saturday, March 14, 2026
HomeTrending NewsBabu-APCID: సిఐడి కార్యాలయంలో చంద్రబాబు

Babu-APCID: సిఐడి కార్యాలయంలో చంద్రబాబు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సిఐడి విచారిస్తోంది. ఈ ఉదయం నంద్యాలలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని సిఐడి ఆఫీసుకు తరలించారు. అనంతరం తమ వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించి బాబును ప్రశ్నిస్తున్నారు.

కాగా, బాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, నందమూరి రామకృష్ణ సిఐడి ఆఫీసుకు వచ్చారు. మరోవైపు హైదరాబాద్ నుంచి నందమూరి బాలకృష్ణ, లోకేష్ భార్య బ్రాహ్మణి లు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలకు టీడీపీ పిలుపు ఇచ్చింది.  రేపు రాష్ట్ర వ్యాప్తంగా  దీక్షలతో నిరసన తెలపాలని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular