Wednesday, October 4, 2023
HomeసినిమాGopichand 32 : గోపీచంద్‌తో డైరెక్టర్ శ్రీను వైట్ల.. కొత్త సినిమా ఓపెనింగ్..

Gopichand 32 : గోపీచంద్‌తో డైరెక్టర్ శ్రీను వైట్ల.. కొత్త సినిమా ఓపెనింగ్..

మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నాడు. ఇటీవల కూడా ఎన్నో అంచనాలతో శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం సినిమా కూడా భారీ పరాజయం పాలైంది. ప్రస్తుతం గోపీచంద్ తన 31వ సినిమాగా డైరెక్టర్ అయిన హర్ష దర్శకత్వంలో ‘భీమ’ సినిమా చేస్తున్నాడు. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

తాజాగా గోపీచంద్ తన 32వ సినిమాని ప్రారంభించాడు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ కామెడీ కమర్షియల్ సినిమాలు అందించిన శ్రీనువైట్లతో గోపీచంద్ కాంబో రానుంది. 2018లో చివరిసారిగా శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో వచ్చి పరాజయం చూశాడు. ఆ తర్వాత మంచు విష్ణుతో ఢీ సినిమాకు సీక్వెల్ ప్రకటించినా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళ తర్వాత శ్రీనువైట్ల దర్శకుడిగా సినిమా రానుంది. నేడు అధికారికంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

సినిమా నిర్మాణం పట్ల ప్యాషన్ ఉన్న వేణు దోనేపూడి ప్రముఖ తారాగణం, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించేందుకు సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్‌ను ప్రారంభించారు. ‘#గోపీచంద్ 32’ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మొదటి సినిమా. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న #గోపీచంద్ 32 ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న