Monday, June 15, 2026
HomeTrending NewsIRR Case: నారా లోకేష్ కు సిఐడి నోటీసులు

IRR Case: నారా లోకేష్ కు సిఐడి నోటీసులు

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో టిడిపి ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేష్ ను స్వయంగా కలిసిన సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు.  అక్టోబర్ 4 న విచారణ కు రావాలని సూచించారు. తనను కలిసిన అధికారులతో లోకేష్ మాట్లాడుతూ “ఇప్పటికే వాట్సాప్ లో పంపించారుగా, అందింది అని రిప్లై కూడా ఇచ్చాను… కాఫి టీ ఎమన్నా తీసుకొంటారా, రాక రాక వచ్చారు కదా” అంటూ  వ్యాఖ్యానించారు.

కాగా, తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని లోకేష్ మీడియాకు వెల్లడించారు. గల్లా జయదేవ్ నివాసం నుంచి ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో ఎంపిలు కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామ కృష్ణం రాజు లతో కలిసి లోకేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular