Sunday, February 23, 2025
HomeTrending Newsనారాయణను విచారించనున్న సిఐడి

నారాయణను విచారించనున్న సిఐడి

అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నారాయణ విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ ను సీఐడీ అధికారులు విచారించారు,  రెవెన్యూ రికార్డుల మాయంపై అధికారులకు వివరణ శ్రీధర్ ఇచ్చినట్లు తెలిసింది.

గతంలో సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన శ్రీధర్ ఈ కేసులో సీఐడీకి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. 2015లో ల్యాండ్ ఫూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారన్న శ్రీధర్, 2015 జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.  అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41 తీసుకొచ్చారని చెప్పారు.

ఈ వ్యవహారాన్నంతా మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారని శ్రీధర్ తెలిపారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను తాను నారాయణ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదని శ్రీధర్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలియవచ్చింది. నారాయణ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందని శ్రీధర్ విచారణలో తెలియజేశారు.  దీనితో నారాయణను విచారించేందుకు సిఐడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్