ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు కొత్త సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంటూ దూసుకెళుతుంది. ఇతర ఓ టి టి వేదికలకు దీటుగా తెలుగులో ‘ఆహా’ భారీ చిత్రాలతో వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టాక్ షోస్ లతో కూడా అలరిస్తోంది. అలాగే ఇతర భాషల్లోని హిట్ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంది.
అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అక్కినేని బ్రదర్స్ నటించిన ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ను ‘ఆహా’ దక్కించుకోవడం విశేషం.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.