Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఫైబర్‌నెట్‌ పై సీఐడీ దర్యాప్తు

ఫైబర్‌నెట్‌ పై సీఐడీ దర్యాప్తు

ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఫైబర్‌నెట్‌ కోసం గతంలో కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి.  ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఫైబర్‌నెట్‌ ఎండీ, ఛైర్మన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం  విచారణ జరిపించాలని నిర్ణయించింది.

గత ప్రభుత్వం హయాలో జరిగిన కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందని, షుమారు 2  వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని, అందుకే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి. గౌతం రెడ్డి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్