సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సంచలన చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 15న మేకింగ్ వీడియో రిలీజ్ చేయనున్నట్టుగా యూనిట్ ప్రకటించింది.
రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో మేకింగ్ వీడియో గ్లింప్స్ ను జులై 15న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరి ఈ వీడియోలో..ఏం చూపించనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలియా భట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంచలన చిత్రాన్ని అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.