Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్కరాటే ఛాంపియన్ కు సిఎం ప్రోత్సాహం

కరాటే ఛాంపియన్ కు సిఎం ప్రోత్సాహం

అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ అరబండి కార్తీక్‌ రెడ్డి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కార్తీక్‌ రెడ్డి స్వస్ధలం తిరుపతి… అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెట్టిన కార్తీక్ ను సిఎం అభినందించారు.  జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కరాటేను శాప్‌ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్‌ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా నిలిచాడు   కార్తీక్‌. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్‌వేగాస్‌లో జరిగిన యూఎస్‌ఏ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణపతకాన్ని దక్కించుకున్నాడు.  దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్‌ కరాటే ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అఫిషియల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా పతకం సాధిస్తానని కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు.

తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్‌ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇస్తామని భరోసా ఇచ్చారు.

పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్‌.కే.రోజా, కార్తీక్‌ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మిల్టన్‌ లూథర్‌ శాస్త్రి, ప్రవీణ్‌ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు సిఎం ను కలిసిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular