Kidambi met AP CM: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా కిడాంబి శ్రీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించారు. నేడు విజయవాడ చేరుకున్న శ్రీకాంత్ సిఎం ను కలుసుకున్నారు.
శ్రీకాంత్ ను సిఎం జగన్ ఘనంగా సన్మానించి ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేశారు. తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ కూడా పాల్గొన్నారు.
Also Read : రాష్ట్రంలో సన్‌ఫార్మా తయారీ ప్లాంట్