Sunday, June 7, 2026
HomeTrending Newsఅలిపిరి వద్ద గో మందిరం ప్రారంభం

అలిపిరి వద్ద గో మందిరం ప్రారంభం

తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం అందించారు.  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి తిరుమల పర్యటనకు వచ్చారు.  రేణిగుంట  విమానాశ్రాయం నుంచి బర్డ్‌ హాస్పిటల్‌ చేరుకుని  శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని అయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టిటిడి సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాసేపట్లో  తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు.

రేపు 12వ తేదీ ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ ఛానళ్ళను  ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిధి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కు తిరుగు పయనమవుతారు.  మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular