Sunday, January 19, 2025
HomeTrending Newsగవర్నర్ తో సిఎం జగన్ భేటీ

గవర్నర్ తో సిఎం జగన్ భేటీ

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు సిఎం తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపటినుంచి రెండ్రోజుల పాటు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు.  విదేశీ అతిథులతో ముఖాముఖి సమావేశాలు జరిపేందుకు సిఎం జగన్ రేపు విశాఖ వెళుతున్నారు.

ఈ సదస్సుకు పలువురు  కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొననున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్