Tuesday, March 17, 2026
HomeTrending Newsప్రకాశం పంతులుకి సిఎం ఘన నివాళి

ప్రకాశం పంతులుకి సిఎం ఘన నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి  150వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపులు) ధర్మాన కృష్ణ దాస్ కూడా టంగుటూరికి అంజలి ఘటించారు.

“తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి ప్రకాశం పంతులు గారి 150వ జ‌యంతి సంద‌ర్భంగా వారికి ఘన నివాళి” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular