స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జనవరి 12 వివేకానంద జయంతిని దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ట్విట్టర్ లో సిఎం సందేశం ఇచ్చారు.
“అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం” అంటూ వివేకానందను స్మరించుకున్నారు జగన్.