Friday, March 29, 2024
Homeసినిమావ‌రుణ్ తేజ్ ‘గ‌ని’లో మిల్కీబ్యూటీ

వ‌రుణ్ తేజ్ ‘గ‌ని’లో మిల్కీబ్యూటీ

Milky Beauty in Item Song: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘గ‌ని’. ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యాన‌ర్స్ పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి అయితే… క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల‌న వాయిదా ప‌డింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ సినిమాలో గల ఐటెం సాంగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఏంటంటే.. ఈ సాంగ్ లో మెరిసే స్టార్ హీరోయిన్ ఎవరు అని టాక్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ బ్యూటీ ఎవరో రివీల్ చేశారు. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫిక్స్ చేసిన‌ట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ఈ మూవీలో ఐటం సాంగ్ ఎలా ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిగా మారింది. అయితే… సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన ఈ మాస్ ఐటెం నెంబర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జనవరి 15 ఉదయం 11 గంటల 8 నిమిషాల వరకు ఆగాల్సిందే.

Also Read :‘గని’కి చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్