Saturday, June 27, 2026
Homeసినిమామార్చి 18న‌ వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్

మార్చి 18న‌ వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్

Varun-Mine: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ టైటిల్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాలపై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ… ‘‘వరుణ్ తేజ్ గని అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్‌లకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్స్ పైనే ఎంజాయ్ చేస్తే ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుంది. అందుకని మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. మార్చి 18, 2022న గని చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular