రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా మంచి ఆదాయం వస్తుందన్న విషయాన్ని తెలియజెప్పాలన్నారు. రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఇ–క్రాపింగ్, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు…
- వ్యవసాయ సలహామండళ్లలో వస్తున్న అభిప్రాయాలు, సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
- రైతుల సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలి
- రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందించాలి
- రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలి
- అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించుకోవాలి
- నేచురల్ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలి
- దీనికి సంబంధించిన సామగ్రి వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి
- ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలి
- అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చు
- డిసెంబరులో వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ప్రారంభం
- వైయస్సార్ పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలి
- 15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న సీఎం
- అగ్రికల్చర్‌కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలి
- మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
- ఇ–క్రాపింగ్ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్ రశీదులు కూడా ఇవ్వాలి
- అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్ కరస్పాండెంట్లు ఉండాలన్న సీఎం
- ఎక్కడ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా వెంటనే కొత్తది ఏర్పాటు చేయాలి. లోడ్, ఇతరత్రా పరిస్థితులపై వెంటనే పరిశీలన చేయాలి
- రైతులకు అవాంతరాల్లేని కరెంటుకోసం, ఉచిత విద్యుత్‌కోసం 10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తున్నాం
- జిల్లా స్ధాయి వ్యవసాయ సలహా మండలి ప్రతినిధులతో రాష్ట్రస్ధాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.