Tuesday, March 19, 2024
Homeసినిమావిశాల్‌ పాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

విశాల్‌ పాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

యాక్ష‌న్ హీరో విశాల్, సునయిన జంటగా ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రూపొందుతోంది. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుంది. అతి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండ‌నుంది. ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగ‌ల యాక్ష‌న్ సీక్వెన్సులు ఉండ‌డం విశేషం. స్టంట్ డైరెక్ట‌ర్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స్టంట్స్ జ‌ర‌గ‌నున్నాయి. స్యామ్ సీఎస్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా బాల‌సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి పోన్ ప‌ర్తిభ‌న్ ర‌చ‌యిత‌.  మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్