Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సచివాలయంలో ఉన్న యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలని అభిప్రాయపడ్డారు. పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు సిఎంకు వివరించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ…

 • వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్‌.. ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం.
 • అలాగే పశు సంవర్థక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి
 • యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చు.
 • ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ఒక హేతుబద్ధత ఉండాలి
 • పశువులకు వ్యాక్సినేషన్‌ పై దృష్టిపెట్టాలి, లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలి
 • పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అది అందాలి
 • జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్‌ సొసైటీల వద్ద అమూల్‌ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలి
 • పాలల్లో రసాయనమూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరగాలి.
 • పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
 • ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్‌ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయన్న అధికారులు.
 • పంజాబ్, చత్తీస్‌ఘడ్, కేరళకు చెందిన అధికారులు సందర్శించి వెళ్లారన్న అధికారులు

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం పైనా సిఎం సమీక్ష.

 • మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పిన  అధికారులు.
 • జువ్వలదిన్నెలో ఇప్పటికే   92.5శాతం పనులు పూర్తయ్యాయని, మొత్తం పూర్తవుతాయని వివరణ
 • నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్‌ నాటికి మొదటి ఫేజ్‌ ఫిషింగ్‌ హార్బర్లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు.
 • రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వివరించారు.

సిఎం మాట్లాడుతూ…

 • ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి
 • ప్రతి ఫిషింగ్‌ హార్భర్‌ నుంచి ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి, ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది
 • ఉపాధికోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆక్వా రైతులకు మేలు జరగాలి.
 • ఫీడు, సీడు రేట్లపై నియంత్రణకోసం తీసుకువచ్చిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి
 • ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలి
 • ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను ఎలా తీసివేశామో, ఈసారి ఆక్వా రంగంలోకూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలన్న ముఖ్యమంత్రి.
 • దీనిపై అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకోవాలి
 • ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్‌ సెంటర్లపైనా దృష్టిపెట్టాలి, సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలి
 • Also Read: సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం: యూపీ సిఎం సలహాదారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com