ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించిన మన బడి – నాడు నేడు మొదటి దశను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విద్యార్ధులకు అంకితం చేయనున్నారు. నేడు (ఆగస్టు 16 సోమవారం) తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో మనబడి నాడు–నేడు పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తిచేసుకున్న పాఠశాలలను రాష్ట్ర విద్యార్ధులకు అంకితం చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటివిడతలో 15,715 స్కూళ్ళను నాడు–నేడు కింద బాగు చేయడం కోసం రూ.3,669 కోట్ల రూపాయల వ్యయం చేసింది ప్రభుత్వం.
దీనితో పాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు వరసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుక అందించనున్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకుంటున్న నేపధ్యంలో మొదటిరోజే విద్యార్దులకు విద్యా కానుక అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం
- 11 గంటలకు పి. గన్నవరం మండలం పోతవరం చేరుకోనున్న సీఎం
- అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీపీ హైస్కూల్‌కు చేరుకుని నాడు–నేడు పైలాన్ ఆవిష్కరిస్టారు
- అనంతరం స్ధానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 1.30 గంటలకు పోతవరం నుంచి బయల్దేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.