-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వైయస్సార్‌ ఉచిత పంటల బీమా

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా

గత ఏడాది 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతన్నలకు రూ. 1,820.23 కోట్ల బీమా పరిహారాన్ని క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ జేశారు.

అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఇబ్బందులు వల్ల కలిగే పంట దిగుబడి నష్టాల నుంచి రైతన్నలకు ఉపశమనం కలిగించేలా, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారు.

కరోనా నేపధ్యంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నలకు పెట్టుబడి కోసం మొన్ననే వరసగా మూడో ఏడాది మొదటి విడత రైతు భరోసా సాయంగా 52.38 లక్షల మందికి రూ. 3,928 కోట్లు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించింది

రైతన్నలకు మరింత మేలు జరగాలని పెట్టుబడి సమయానికే సాయం ఉండాలన్న మంచి ఉద్దేశంతో నేడు మరో
రూ. 1,820.23 కోట్లను ఖరీఫ్‌ 2020 ఉచిత పంటల బీమా క్షెయిమ్‌గా 15.15 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో  ప్రభుత్వం జమ చేస్తుంది

గత ప్రభుత్వ హయాంలో 2018–19కి చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బీమా క్లెయిమ్‌ బకాయిలతో పాటు ఈ ప్రభుత్వం 2019–2020 సంవత్సరములో వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం క్లెయిమ్‌ల క్రింద ఇచ్చిన రూ. 1252.18 కోట్లతో కలిపి మొత్తం రూ. 1968.02 కోట్ల బీమా పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించింది.

నేడు 2020–21కి అందిస్తున్న మరో రూ.1820.23 కోట్లతో కలిపి మొత్తం రూ.3,788.25 కోట్ల బీమా పరిహారం ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లిస్తున్నట్లయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్