ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 8,9 తేదీలలో రెండ్రోజుల పాటు అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటారు. రాయదుర్గంలో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రిల్యాబ్ ను ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు, అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీంతోపాటు పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనల అనంతరం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు.
రెండో రోజు బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, బహిరంగసభలో పాల్గొంటారు, ఆ తర్వాత కడప నగరంలో వివిధ అభివృద్ది పనుల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని అనంతరం గన్నవరం చేరుకుంటారు.
.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com