Saturday, April 20, 2024
HomeTrending News‘శతమానం భవతి’ మా విధానం: సిఎం

‘శతమానం భవతి’ మా విధానం: సిఎం

AP CM Launched The YSR Bima Insurance Scheme For The Poor : 

పెద్దలు ‘శతమానం భవతి’ అని దీవిస్తారని, అంటే వందేళ్ళు జీవించాలని కోరుకుంటారని, తమ ప్రభుత్వం కూడా ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పొందేందుకు ఆదాయ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచామని సిఎం గుర్తు చేశారు. ఆరోగ్ర్యశ్రీని 2450 వైద్య ప్రక్రియలకు వర్తిమజేశామని వివరించారు.

కానీ అనుకోని పరిస్థితుల్లో, అదృష్టం బాగోలేక కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అలాంటి విపత్కర సమయంలో ఆయా కుటుంబాలకు అండగా నిలిచే మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతున్నామని సిఎం చెప్పారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని సిఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రభుత్వమే అమలు చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పేద కుటుంబాలకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఈ పథకం కింద 18 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు గల వ్యక్తి సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం… 18 నుంచి 70 ఏళ్ళ మధ్య వయస్సు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తారు. పేద కుటుంబాల మీద రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 2021–22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ. 750 కోట్ల వ్యయంతో ఈ ఉచిత బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది.

Also Read : ఉద్యోగాలకల్పనే ధ్యేయంకావాలి : జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్